others

Balapur Ganesh Laddu Auction: ఈసారి ఎవరు దక్కించుకున్నారు? ఎంతకు?

బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట ఆసక్తికరంగా సాగింది. ప్రతీ ఏడాది లడ్డూ ధర పెరుగుతూ గత ఏడాది అంటే.. 2024లో రూ.30.01 లక్షలకు చేరింది. ఈ ఏడాది ఆద్యంతం ఆసక్తిగా కొనసాగిన లడ్డూ వేలం పాటలో ఎవరు లడ్డూను దక్కించుకున్నారంటే..

Balapur Ganesh Laddu Auction: ఈసారి ఎవరు దక్కించుకున్నారు? ఎంతకు?

వినాయక నిమజ్జనం (Ganesha immersion) అనగానే మనకు గుర్తొచ్చేది.. ఖైరతాబాద్ మహా గణపతి (Khairathabad Maha Ganapathi) నిమజ్జనం, బాలాపూర్‌ గణేశుడి లడ్డూ (Balapur Ganesh Laddu Auction) వేలంపాట. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రలో వేల మంది భక్తులు పాల్గొంటారు. అలాగే బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట తెలుగు రాష్ట్రాల్లోనే ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. మరోవైపు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట ఆసక్తికరంగా సాగింది. ఈ బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాటకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఆద్యంతం ఆసక్తిగా కొనసాగిన లడ్డూ వేలం పాటలో ఎవరు లడ్డూను దక్కించుకున్నారంటే.. లింగాల దశరథ్ గౌడ్ మరి ఆయన ఎంతకు దక్కించుకున్నారో చూద్దాం.

లడ్డూ వేలం ఎప్పుడు ప్రారంభమైంది?

బాలాపూర్‌ (Balapur)లో 1994లో రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం.. ప్రతీ ఏడాది పెరుగుతూ గత ఏడాది అంటే.. 2024లో రూ.30.01 లక్షలకు చేరింది. బీజేపీ (BJP) నేత కొలన్ శంకర్ రెడ్డి లడ్డూను గెలుచుకున్నారు. ఏటేటా తన రికార్డును ఈ గణేశుడు (Lord Ganesh) తనే బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ఏడాది కూడా గతేడాది రికార్డును బాలాపూర్ గణపతి అధిగమించాడు బాలాపూర్‌ గణపయ్య.. 2024లో ఈ లడ్డూను గెలుచుకున్నారు. బాలాపూర్ లడ్డూను దక్కించుకుంటే సకల విజయాలు సిద్ధిస్తాయని నమ్మకం కాబట్టి ప్రతీఏడాది లడ్డూ వేలం కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు. ఎంత డబ్బు పెట్టేందుకైనా వెనుకాడరు. అంతేకాకుండా బాలాపూర్ గణపతి లడ్డూ వేలంకి ఓ ప్రత్యేకత కూడా ఉంటుంది. అదేంటంటే.. వేలంలో పాల్గొనాలనుకుంటే.. గత ఏడాది ఆక్షన్‌లో పలికిన లడ్డూ ధరను ముందుగా డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

లడ్డూ ఎంత పలికింది?

కాగా, 1994లో మొదటిసారి లడ్డూ వేలంలో రూ.450కి కొలను ​మోహన్‌రెడ్డి దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ 30 సార్లు బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాట జరిగింది. ఒక్క 2020లో మాత్రం కరోనా (Covid) కారణంగా వేలం నిర్వహించలేదు. ఆ సమయంలో బాలాపూర్ లడ్డూను అప్పటి సీఎం కేసీఆర్‌ (KCR)కు అందజేశారు. రూ.1116తో ఈ వేలం పాట ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి లక్షలకు చేరుతుంది. ఈ లడ్డూ వేలం పాటను చూసేందుకు ఒక్క స్థానికులు మాత్రమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. ఈ సారి వేలంలో పాల్గొనాలనేందుకు ఏడుగురు ముందుగా డబ్బు డిపాజిట్ చేశారు. వారెవరంటే.. మర్రి రవికిరణ్​ రెడ్డి (చంపాపేట్‌), అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి (ఎల్బీ నగర్‌), లింగాల దశరథ్ గౌడ్ (కర్మాన్‌ఘాట్‌), కంచర్ల శివారెడ్డి (కర్మాన్‌ఘాట్‌), సామ రాంరెడ్డి (దయా).. కొత్తగూడెం, కందుకూరు, పీఎస్‌కే గ్రూప్‌ (హైదరాబాద్‌), జిట్టా పద్మా సురేందర్‌రెడ్డి (చంపాపేట్‌). వీరిలో లడ్డూను లింగాల దశరథ్ గౌడ్ (Lingala Dasarath Goud) రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. మొత్తానికి గత ఏడాది కంటే ఈ ఏడాది దాదాపు రూ.5 లక్షలు ఎక్కువ ధరను బాలాపూర్ గణేశుడి లడ్డూ పలికింది.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 6, 2025 5:49 AM