Entertainment

Rakasa Review: ‘రాకాస’ మూవీ ఎలా ఉందంటే..

కమిటీ కుర్రాళ్లు వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత మెగా డాట‌ర్ నిహారిక కొణిదెలా నిర్మాణంలో సినిమా వస్తోందంటేనే అంచనాలు పెరిగిపోతున్నాయి ఇవాళ నిహరిక నిర్మించిన ‘రాకాస’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Rakasa Review: ‘రాకాస’ మూవీ ఎలా ఉందంటే..

చిత్రం: రాకాస

విడుదల: 03-04-2026

నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి తదితరులు

దర్శకురాలు: మానస శర్మ

మ్యూజిక్: అనుదీప్ దేవ్

నిర్మాత: నిహారిక

కమిటీ కుర్రాళ్లు వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత మెగా డాట‌ర్ నిహారిక కొణిదెలా నిర్మాణంలో సినిమా వస్తోందంటేనే అంచనాలు పెరిగిపోతున్నాయి ఇవాళ నిహరిక నిర్మించిన ‘రాకాస’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తోడుగా ప్రమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లి సినిమాపై హైప్‌ను బీభత్సంగా క్రియేట్ చేశారు. అలాగే మేకర్స్ సైతం ఇదొక చందమామ కథలాంటి చిత్రమని చెప్పేశారు. మరి సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ఉందా? అనేది చూద్దాం.

ఇప్పటి కిడ్స్‌కి అయితే చందమామ కథల గురించి తెలియదు కానీ 90స్ కిడ్స్‌కి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు చందమామ కథల్లో, బాలమిత్ర కథల్లో ఇలా బ్రహ్మ రాక్షసుల గురించి, రాక్షసుల గురించి ఎన్నో కథలు చదివేశాం. అలాగే చిన్నప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్పే ఎన్నో కథలు విన్నాం. అలాంటి కథనే సినిమాగా మలచినట్టు దర్శకురాలు మానస శర్మ ముందే చెప్పేశారు. అలాగే ఒక రాక్షసుడి కథతో సినిమాను ప్రారంభించారు.

కథేంటంటే..

ఒక ఊరిలో ఒక పెద్ద కోట. అందులో ఒక రాక్షసుడు ఉంటాడు. అతను బలి కోరుతూ ఉంటాడు. తనకు బలి కావాలన్నప్పుడు మూడు సిగ్నల్స్ ఇస్తాడు. కట్ చేస్తే.. వీరబాబు (సంగీత్ శోభన్) తన చిన్ననాటి ప్రియురాలు సుకన్యను వెతుక్కుంటూ అమెరికా నుంచి స్వగ్రామానికి వస్తాడు. అయితే అతను వచ్చేసరికి ఆమె వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతుంది. ఆ తరువాత వీరబాబును చూసిన సుబ్బలక్ష్మి (నయన్ సారిక) అతనితో ప్రేమలో పడుతుంది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో సోము (వెన్నెల కిషోర్) హత్య కేసులో వీరబాబు అనూహ్యంగా ఇరుక్కుంటాడు. అతని పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఆ తరువాత కోటలోని రాక్షసుడికి బలిచ్చే సమయం ఆసన్నమవుతుంది. దీనిలో అనూహ్యంగా వీరబాబు ఇరుక్కుంటాడు. అతడిని బలి కోసం కోటలోకి పంపిస్తారు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? వీరబాబును రాక్షసుడు బలి తీసుకున్నాడా? అనేది వెండితెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

దర్శకురాలు మానస శర్మ పాతకాలపు చందమామ కథను నేటి తరానికి నచ్చేలా.. రూపొందించారు. చందమామ కథకు కామెడీ, ఫన్ ఎలిమెంట్స్ జోడించి ఒక చక్కటి సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమాను రూపొందించారు. ప్రథమార్థమంతా హాస్య సన్నివేశాలతో ఆసక్తికరంగానే సాగుతుంది. సెకండాఫ్‌ అసలు కథలోకి తీసుకెళుతుంది. సెకండాఫ్ కూడా పెద్దగా బోర్ అనిపించదు. సెకండాఫే సినిమాకు ప్రాణం. చందమామ కథను ఆసక్తికరంగా మలచడంలో మానస శర్మ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అలాగే చివరిలో సెకండాఫ్‌ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఒక పాటలో నిహారిక సైతం మెరిసి తీన్‌మార్ స్టెప్స్‌తో అదరగొట్టేశారు.

ఎవరెలా నటించారంటే..

హీరో సంగీత్ శోభన్ తన వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. అతనిలోని కామెడీ టైమింగ్, యాక్టింగ్ అన్నీ సినిమాకు బాగా కుదిరాయి. సినిమాను పూర్తిగా తన భుజాలపై మోశాడనడంలో సందేహమే లేదు. ఫస్టాఫ్‌లో గెటప్ శ్రీనుతో, సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్‌తో సంగీత్ పండించిన కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. హీరోయిన్ నయన్ సారిక సింపుల్‌గా కనిపించింది. ఇక నటన పరంగా అద్భుతంగా నటించింది. సంగీత్, నయన్ మధ్య కెమెస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయ్యిది. బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించారు.

టెక్నికల్ పరంగా...

అనుదీప్ దేవ్ అందించిన మ్యూజిక్ అయితే పెద్దగా ఆకట్టుకోలేదు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు బాగా సెట్ అయ్యింది. స్ర్కీన్‌ప్లే అద్భుతం. రాజు ఎదురోలు కెమెరా వర్క సినిమాకు ప్రాణం. సినిమాలోని పల్లెటూరి వాతావరణాన్ని, పురాతన కోట మూడ్‌ను చాలా లైవ్లీగా చూపించారు. ఇక నిర్మాణ విలువలు సైతం సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి.

ఫైనల్‌గా: ‘రాకాస’ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

రేటింగ్: 3/5

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 3, 2026 9:15 AM