Bandla Ganesh: వచ్చేశాడురా బాబు.. ఇండస్ట్రీ బట్టలూడదీశాడు..
ఇటీవలి కాలంలో ఒక మాట బాగా వైరల్ అయ్యింది. అదేంటంటే.. ‘వీడొచ్చేశాడురా బాబు’ అని.. నిజమే.. వచ్చాడంటే వాడిని ఆపడం కష్టమే.. ఇండస్ట్రీలోనూ ఒకరున్నారు.

ఇటీవలి కాలంలో ఒక మాట బాగా వైరల్ అయ్యింది. అదేంటంటే.. ‘వీడొచ్చేశాడురా బాబు’ అని.. నిజమే.. వచ్చాడంటే వాడిని ఆపడం కష్టమే.. ఇండస్ట్రీలోనూ ఒకరున్నారు. ఆయన వచ్చి మైక్ అందుకుంటే ఎవరికి మూడుతుందో చెప్పలేం. అలా ఉంటుంది ఆయన స్పీచ్.. తాజాగా అయితే ఇండస్ట్రీ బట్టలూడదూసి రోడ్డున నిలబెట్టారు. ఆయన మరెవరో కాదు.. నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఆయన మాటలు అక్షర సత్యం.
తాజాగా బండ్ల గణేష్ (Bandla Ganesh) ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) మూవీ సక్సెస్ మీట్‌కు హాజరయ్యారు. స్టేజ్‌పై ఆయన మాట్లాడిన మాటలు రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ (Mouli Tanuj Prashanth)ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. సినిమా విడుదలైన ఈ 20 రోజులుగా జరిగిందంతా ఒక కల్పన.. అబద్ధం అని పేర్కొన్నారు. కళ్ల జోడు తీసి ఈ సినిమా రిలీజ్ రోజు ఏ స్టేటస్ మీద అయితే ఉన్నావో అదే స్టేటస్ మీద ఉండంటూ మౌళికి బండ్ల గణేష్ తెలిపారు. ఇంకా ఆయన మౌళితో మాట్లాడుతూ.. ‘‘నాలాంటి వాడు నీ దగ్గరకు వచ్చి ఆరడుగుల హైట్ ఉన్నావని చెబుతారు. మీ ముందు విజయ్ దేవరకొండ, మహేష్ బాబు ఏం పనికొస్తారండి అని కూడా అంటారు’’ అని.. అవన్నీ నమ్మవద్దని హితవు పలికారు. చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని ఏలాలని తెలిపారు. వాస్తవంలో బతకాలని వాస్తవాన్ని నమ్మాలని.. గాజువాక బేస్‌ను మరచిపోవద్దని మౌళికి తెలిపారు. ఈ ఫిలింనగర్ (Filmnagar).. ఈ సినిమా (Movie).. ఈ ట్వీట్లు (Tweets), ఈ ఫోటోలు.. ఈ పొగడ్తలు అన్నీ వట్టి ట్రాష్ అన్నట్టుగా బండ్ల గణేష్ పేర్కొన్నారు.
ఎవరినీ నమ్మకు.. నమ్మినట్టుగా ఉండు..
ఇంటికి వెళ్లగానే వాస్తవానికి తిరిగి వెళ్లాలని మౌళికి సూచించారు. ఈ మాఫియా మనల్ని బతకనివ్వదని... కాబట్టి ఈ మాఫియాకు దూరంగా ఉండాలంటే మనం బేస్ మీదుండాలని తెలిపారు. ఇండస్ట్రీలో ఎవరినీ నమ్మవద్దని తెలిపారు. చిరంజీవి (Chiranjeevi)కి ఒకప్పుడు ఒక ఏడాది గ్యాప్ వచ్చిందని.. ఆ సమయంలో శ్రీకాంత్ (Actor Srikanth)తో అల్లు అరవింద్ ‘పెళ్లి సందడి’ (Pellisandadi Movie) సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఇక శ్రీకాంత్ స్టార్ అయిపోయాడన్నారని.. ఏవేవో అన్నారని తెలిపారు. కానీ ఒక స్టార్‌ను మనం ఏమీ చేయలేమని.. ఎవరో వంద కోట్లకు ఒక మెగాస్టార్ (Megastar) పుడతాడని బండ్ల గణేష్ (Bandla Ganesh) పేర్కొన్నారు. అలాంటి వారిని టచ్ చేయలేమన్నారు. మౌళి మంచి నటుడని.. మంచి నటుడిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని... అలాగే హెచ్చరిస్తున్నానని సైతం తెలిపారు. ఈ పొగడ్తలను నమ్మవద్దని... రౌడీ హీరో (Rowdy Hero Vijay Devarakonda) షర్ట్ ఇచ్చాడని.. మహేష్ బాబు (Mahesh Babu) ట్వీటేశాడని.. బండ్ల గణేష్ ఏదో చేశాడు.. అవన్నీ అబద్ధాలని.. కేవలం నిన్ను బ్లష్ చేయడానికి చేస్తారంటూ చెప్పుకొచ్చారు. ఇంకో రోజు ఇంకో మౌళి వస్తాడని.. ప్రతి దానికీ ప్రిపేర్ అయి ఉండాలని సూచించారు. ఎవరినీ నమ్మకు.. నమ్మినట్టుగా ఉండాలని. వాస్తవంగా బతకాలని బండ్ల గణేష్ హితవు పలికారు.
ఒక్క చేయి రాకున్నా ఆశ్చర్యం లేదు..
ఒక్క సినీ ఇండస్ట్రీకే కాదు. ప్రతి రంగానికీ బండ్ల గణేష్ మాటలను అన్వయించుకోవచ్చు. మనకు శ్రీహరికోట నుంచి రాకెట్ వదిలినప్పుడల్లా మనమో మాట మననం చేసుకుంటాం.. ‘నిప్పులు చిమ్ముతు నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు కక్కుతు నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే’ అనే ఓ మహానుభావుడి కవితను గుర్తు చేసుకుంటాం.. నిజమే.. మన హవా నడుస్తున్నంత కాలమే మనకు గొడుగు పడతారు. ఒక్కసారి పడిపోయామా.. కనీసం మనల్ని లేపేందుకు ఒక్క చేయి రాకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది లోకం పోకడ. ఇది ఇండస్ట్రీకి అయితే మరింత బాగా సూట్ అవుతుంది. ఎక్కడో వరకు ఎందుకు? ఇటీవల ఫిష్ వెంకట్‌ని చూశాం కదా.. అన్ని రోజుల పాటు డెత్ బెడ్‌పై హాస్పిటల్‌లో ఉంటే తిరిగి చూసిన దిక్కులేదు. ఏ ఒక్క సెలబ్రిటీ కూడా అయ్యో అన్న పాపాన పోలేదు. నిజం నిష్టూరంగా ఉంటుందంటారు. బండ్ల గణేష్ ఇండస్ట్రీని మాఫియాతో పోల్చడం కొంత ఆశ్చర్యం కలిగించవచ్చు. మాటలు అందరికీ రుచించకపోవచ్చు కానీ అక్షరసత్యాలు.
ప్రజావాణి చీదిరాల